గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 26, 2021 , 10:39:41

నా సోద‌రుడికి ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించినందుకు సంతోషంగా ఉంది: చిరు

నా సోద‌రుడికి ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించినందుకు సంతోషంగా ఉంది:  చిరు

దివంగ‌త గాయ‌కుడు, గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం  2021 సంవ‌త్స‌రానికి గాను ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద్మ విభూష‌ణ్ అవార్డుకు ఎంపికయిన సంగ‌తి తెలిసిందే. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప‌ద్మ అవార్డుల‌లో బాలుతో పాటు చిత్ర కూడా ఉన్నారు. ఎస్పీ బాలుకు తమిళనాడు తరఫున ఈ పురస్కారం లభించడం గమనార్హం.

ఇప్ప‌టికే ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం అందుకున్న బాలుకు ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డ్ ద‌క్క‌డం ప‌ట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేశారు. నా ప్రియ‌మైన సోద‌రుడు ఎస్పీ బాలు గారుకు ప‌ద్మ విభూష‌ణ్‌కు ప్ర‌క‌టించినందుకు సంతోషంగా ఉంది. అత‌ను దీనికి అర్హుడు. మర‌ణానంతరం అనే ప‌దం బ్రాకెట్స్‌లో ఉండ‌డం బాధ‌ను క‌లిగిస్తుంది. ఈ అవార్డును ఆయ‌న‌ వ్య‌క్తిగ‌తంగా స్వీక‌రించి ఉంటార‌ని భావిస్తున్నాను అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు మెగాస్టార్.

VIDEOS

logo