గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 11:04:43

విజ‌య్ కెరీర్‌లో జీరో ఇయ‌ర్‌గా 2020..!

విజ‌య్ కెరీర్‌లో జీరో ఇయ‌ర్‌గా 2020..!

త‌మిళ‌ స్టార్ హీరో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 27 ఏళ్ళు అయింది.ఈ 27 ఏళ్ళ‌లో ఏడాదికి రెండు లేదా మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. కాని ఈ ఏడాది క‌రోనా కార‌ణంగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా విడుద‌ల చేయ‌లేదు. కేంద్ర ప్ర‌భుత్వం అక్టోబ‌ర్ 15 నుండి థియేట‌ర్స్ తెర‌చుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించ‌డంతో విజ‌య్ అభిమానులు ఆయ‌న న‌టించిన మాస్ట‌ర్ సినిమాని దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేస్తార‌ని భావించారు. అయితే చిత్ర నిర్మాత‌లు విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన మాస్ట‌ర్ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కాదు అనే స‌రికి ప్రేక్ష‌కులు నీర‌సించారు. 

ఏడాదికి క‌నీసం ఒక చిత్రం అయిన రిలీజ్ చేసే విజ‌య్ ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం లేద‌నే స‌రికి ఆయ‌న స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసార‌ని అంటున్నారు. 27 ఏళ్ల కెరీర్‌లో 2020 జీరో ఇయ‌ర్‌గా మారుతుంద‌ని చెబుతున్నారు. కాగా, విజ‌య్ ఇటీవ‌లి కాలంలో మంచి హిట్స్ సాధించ‌లేక‌పోయాడు. ఈ క్ర‌మంలో మాస్ట‌ర్ చిత్రం భారీ హిట్ సాధించాల‌ని అభిమానులు కోరుతున్నారు. 


logo