శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 20, 2020 , 09:50:22

కోవిడ్ వార్డ్‌లో డాక్ట‌ర్ డ్యాన్స్.. అభినందించిన హృతిక్

కోవిడ్ వార్డ్‌లో డాక్ట‌ర్ డ్యాన్స్.. అభినందించిన హృతిక్

క‌రోనా మ‌హ‌మ్మారి కొద్ది రోజుల క్రితం ప్ర‌పంచాన్ని ఎంత‌లా వ‌ణికించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ వైర‌స్ వ‌ల‌న చాలా మంది మృత్యువాత‌ప‌డ్డారు. కొంద‌రు దీనికి భ‌య‌ప‌డి క‌రోనా వ‌చ్చిన వారిని అంట‌రాని వారిగా చూశారు. కాని ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్ అయిన వైద్య‌లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాల‌కు తెగించి త‌మ వృత్తిని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించారు.

విధి నిర్వ‌హ‌ణ‌లో వృత్తి నిబ‌ద్ధ‌త‌కు ప్ర‌తి రూపంగా నిలిచిన కొంద‌రు వైద్యులు కోవిడ్ వార్డ్‌లో ఉన్న పేషెంట్స్ ని ఉత్సాహ‌ప‌రిచేందుకు పాట‌లు పాడ‌డం, డ్యాన్స్ లు చేయ‌డం వంటివి చేశారు. తాజాగా అస్సాంలోని సిల్చార్ మెడిక‌ల్ కాలేజ్ ఆసుప‌త్రిలో ఈఎన్టీ స‌ర్జ‌న్‌గా అరుప్ సేనాప‌తి ప‌ని చేస్తున్నారు. ఈయ‌న క‌రోనా రోగులను ఉత్సాహ‌ప‌రిచేందుకు వార్డ్‌లో డ్యాన్స్ చేశారు. పీపీఈ కిట్ ధ‌రించి ఎంతో ఉత్సాహంగా హృతిక్ రోష‌న్ న‌టించిన వార్ సినిమాలోని ఘున్గ్రూ పాట‌కు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

డ్యాన్స్‌లో ఏ మాత్రం అనుభ‌వం లేని అరుప్ రోగుల‌కు ఉత్సాహాన్ని నింపేందుకు డ్యాన్స్ చేయ‌గా, ఆయ‌న ప్ర‌య‌త్నాన్ని ప్ర‌తి ఒక్క‌రు అభినందిస్తున్నారు. హృతిక్ రోష‌న్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా అరుప్ డ్యాన్స్ వీడియోని షేర్ చేస్తూ అభినందించారు. ఏదో ఒక రోజు అస్సోంలో అత‌ని  డ్యాన్స్  నేర్చుకొని స్టెప్పులు వేస్తాను. అత‌నితో చెప్పండి. మంచి మ‌నిషి అంటూ కామెంట్ పెట్టారు.