మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 13:13:33

ద‌క్షిణాది రికార్డుల రారాజు ప్ర‌భాస్..!

ద‌క్షిణాది రికార్డుల రారాజు ప్ర‌భాస్..!

‘బాహుబలి’ సినిమా ప్ర‌భాస్‌కి  పాన్‌ఇండియా హీరోగా  సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఆయ‌న‌ అభిమానగణం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల‌ ప్రభాస్‌ ఫేస్‌బుక్‌లో కొత్త రికార్డు సృష్టించారు. ఆయన ఫాలోవర్స్‌ సంఖ్య కోటి నలభైలక్షలు (14మిలియన్లు) దాటింది. ఈ రికార్డుతో ఆయన దక్షిణాది హీరోలందరిలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రభాస్‌ తర్వాత అల్లు అర్జున్‌ కోటి 31లక్షల ఫాలోవర్స్‌తో ద్వితీయ స్థానంలో ఉన్నారు.

ఈ అరుదైన రికార్డ్ అందుకొని నెల రోజులు కూడా కాక‌ముందే ప్ర‌భాస్ మ‌రో మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సాధించాడు. దీంతో ఆయ‌న ఫాలోవ‌ర్స్ సంఖ్య 15 మిలియ‌న్స్‌కి చేరింది. ఈ రికార్డ్ సాధించిన ఏకైక ద‌క్షిణాది హీరో ప్ర‌భాస్ కాగా, ప్ర‌భాస్ ఫ్యాన్  ఫాలోయింగ్‌ అనూహ్యంగా ‌పెరుగుతూ పోతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. . ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ పీరియాడిక్‌ సినిమాలో నటిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. కొంతభాగం చిత్రీకరణ పూర్తయింది. యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఓ డియర్‌' ‘రాధేశ్యామ్‌' అనే పేర్లను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo