మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 23:31:33

జూలై 31న రిలీజ్ కానున్న "శకుంతాల దేవి"

జూలై 31న రిలీజ్ కానున్న

బెంగళూరు : గణిత శాస్త్ర పండితురాలు శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన "శకుంతాల దేవి" చిత్రం విడుదలకు సిద్ధమైంది. విద్య, గణితశాస్త్రంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం సంపాదించిన ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అలాంటి ఉన్నతమైన విద్యావేత్త జీవితాన్ని శకుంతలాదేవీకి తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులు అదుపులోకి రానందున్న ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. శకుంతలా చిత్రానికి నయనికా మహ్తానీతో కలిసి అను మీనన్ రచయితగా, ఇషితా మోయిత్రా డైలాగ్స్ అందించింది.

బాలలకు, యువతలో స్ఫూర్తిని నింపే చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రాన్ని జూలై 31వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని విద్యాబాలన్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. శకుంతలాదేవి మూవీ ప్రీమియర్లు జూలై 31న అమెజాన్ ప్రైమ్‌లో ప్రదర్శించబడుతాయి అని విద్యాబాలన్ పేర్కొన్నారు. "శకుంతలా దేవి పాత్రను పోషించడం నాకు గర్వంగా ఉన్నది. ఉన్నతమైన విద్యావిలువలు ఉన్న శకుంతలాదేవి విజయాలను అందుకొనే క్రమంలో తనదైన పరిధిలో మహిళా సాధికారితను, ధైర్య సాహసాలను ప్రదర్శించారు. అనేక ఇబ్బందులను, సమస్యలను సులభంగా అధిగమించారు" అని అన్నారు. 


logo