శనివారం 11 జూలై 2020
Cinema - May 30, 2020 , 14:31:23

రిషీ లోకాన్ని విడిచి స‌రిగ్గా నెల రోజులైంది..!

రిషీ లోకాన్ని విడిచి స‌రిగ్గా నెల రోజులైంది..!

బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషీ క‌పూర్ స‌రిగ్గా నెల రోజుల క్రితం అంటే ఏప్రిల్ 30,2020న అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతితో బాలీవుడ్ పరిశ్ర‌మ దిగ్భ్రాంతి చెందింది. లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న కార‌ణంగా కొద్ది మంది స‌మ‌క్షంలో రిషీ క‌పూర్ అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. లాక్‌డౌన్ వ‌ల‌న రిషీ కూతురు రిద్ధిమా త‌న తండ్రి చివ‌రి చూపుకు నోచుకోలేక‌పోయింది. 

నేటితో రిషీ క‌పూర్ లోకాన్ని విడిచి నెల రోజులు పూర్తైన సంద‌ర్భంగా ఆయ‌న భార్య నీతూ క‌పూర్ త‌న ఇన్‌స్టాగ్రాములో ఫోటోని షేర్ చేస్తూ వెరా లిన్ రాసిన సాంగ్ లిరిక్స్‌ని కామెంట్ రూపంలో పెట్టింది. రిషీ మ‌ర‌ణించి అప్పుడే నెల రోజులు అవుతుందంటే అంద‌రికి ఆశ్చ‌ర్యంగా ఉంది. రెండేళ్ళుగా  ల్యుకేమియాతో బాధ‌ప‌డుతున్న రిషీ క‌పూర్ ఏప్రిల్ 20 ఉద‌యం 8.45ని.ల‌కి ముంబైలోని స‌ర్‌హెచ్ఎన్ రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ హాస్పిట‌ల్‌లో మృతి చెందారు. 

కాగా, మ‌రో బాలీవుడ్ ఇర్ఫాన్ ఖాన్ రిషీ మ‌ర‌ణించిన ముందు రోజు అంటే ఏప్రిల్ 29న క‌న్నుమూశారు. వెంట‌వెంట‌నే ఇద్ద‌రు లెజెండ్స్ లోకాన్ని విడిచి వెళ్ళ‌డంతో బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ శోక‌సంద్రంలో మునిగింది.logo