శనివారం 06 జూన్ 2020
Cinema - May 01, 2020 , 11:06:30

అఘోరాగా బాల‌య్య‌..క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు

అఘోరాగా బాల‌య్య‌..క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శీను క‌లిసి ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే . ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్ వ‌ల‌న ఆగిపోయింది. కొద్ది రోజులుగా ఈ చిత్రంలో బాల‌కృష్ణ పాత్ర‌కి సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు అఘోరాగా క‌నిపిస్తారని ,మ‌రి కొంద‌రు యాక్ష‌న్ లుక్‌లో ఉండ‌నున్నార‌ని చెప్పుకొచ్చారు.

తాజాగా చిత్ర ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శీను మీడియాతో మాట్లాడుతూ.. మా తాజా సినిమాలో బాల‌కృష్ణ‌ ఓ పాత్రలో అఘోరా గా కనిపిస్తాడని, ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా అద్భుతమైన నేపథ్యంతో ఆ పాత్రకు ఉంటుంది అని చెప్పుకొచ్చారు. బోయ‌పాటి క్లారిటీతో సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు పెరిగాయి.  ఈ చిత్రాన్ని నిర్మాత మిర్యాల రవీంధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.logo