మంగళవారం 26 మే 2020
Cinema - Apr 27, 2020 , 12:24:13

బుడ్డోడిలా కనిపిస్తాడు కానీ బుల్డోజర్ మాదిరి..!

బుడ్డోడిలా కనిపిస్తాడు కానీ బుల్డోజర్ మాదిరి..!

చూడ్డానికి మూడు అడుగులే ఉంటాడు కాని ఆరడుగులు ఉన్న వారికి కూడా త‌న‌దైన శైలిలో పంచులు విసురుతూ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తాడు. అత‌నెవ‌రో కాదు జ‌బ‌ర్ధ‌స్త్ ఫేమ్ న‌రేష్‌. వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గాం ద‌గ్గ‌ర ఉన్న అనంత‌పురంలో జ‌న్మించిన న‌రేష్‌కి చిన్న‌ప్పటి నుండే ఎదుగుద‌ల లోపం ఉంద‌ట‌. దీనినే ఆయ‌న అవ‌కాశంగా మార్చుకున్నాడు. ప్ర‌స్తుతం జ‌బ‌ర్ధ‌స్త్‌కి సంబంధించిన అన్నీ టీం లీడ‌ర్స్‌తో క‌లిసి పని చేస్తున్న నరేష్ హైద‌రాబాద్‌లో ఓ ఫ్లాట్‌, సొంతూరులో ఓ ఇల్లు క‌ట్టుకొని మంచిగా సెటిల‌య్యాడ‌ట‌.

2000వ సంవ‌త్స‌రంలో జ‌న్మించిన న‌రేష్‌కి ప్ర‌స్తుతం 20 ఏళ్లు. ఢీ జూనియ‌ర్స్ కార్య‌క్ర‌మంతో బుల్లితెర‌కి ప‌రిచ‌య‌మైన న‌రేష్ అన్న‌పూర్ణ స్టూడియోస్ ద‌గ్గ‌ర అవ‌కాశాల కోసం తిరుగుతూ ఉండేవాడు. ఓ రోజు సుధాక‌ర్ చూసి న‌రేష్‌ని చంటి టీంలో పెట్టాడ‌ట‌. అక్క‌డ నుండి బుల్లెట్ భాస్కర్ టీంలోకి వెళ్లాడు. ఇక అక్క‌డ నుండి మ‌నోడి ద‌శే తిరిగింది. అనేక కామెడీ షోస్ చేస్తూ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాడు. స్టేజ్‌పైకి వెళ్లే ముందు అంద‌రు రిహార్స‌ల్స్ చేస్తారు. కాని మ‌నోడు కంటెంట్ ఏంటో తెలుసుకొని డైరెక్ట్‌గా రంగంలోకి దిగుతాడ‌ట‌.న‌రేష్ టాలెంట్ చూసి టీం లీడ‌ర్స్ కూడా ఆశ్చ‌ర్య‌పోయిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయ‌ని అంటుంటారు. 


logo