బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 26, 2020 , 08:08:38

స‌మంత కామ‌న్ డీపీ విడుద‌ల చేసిన త‌మ‌న్నా

స‌మంత కామ‌న్ డీపీ విడుద‌ల చేసిన త‌మ‌న్నా

సౌత్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ స‌మంత బ‌ర్త్‌డే ఈ నెల 28 కావ‌డంతో అభిమానులు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో హంగామా మొద‌లు పెట్టేశారు. అయితే మంగ‌ళ‌వారం 33వ బ‌ర్త్‌డే జ‌రుపుకోనున్న స‌మంత కోసం అభిమానులు కామ‌న్ డీపీ రూపొందించారు. దీనిని త‌మ‌న్నా త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఈ ప్ర‌త్యేక సంద‌ర్భంలో స‌మంత డీపీ విడుద‌ల చేస్తున్నాను అని త‌మ‌న్నా పేర్కొంది.

స‌మంత త‌న కెరీర్‌ని అత్య‌ద్భుతంగా మ‌ల‌చుకొని ముందుకు వెళుతున్న తీరు ఆద‌ర్శం. బ్యూటీ విత్ బ్రెయిన్‌, సూప‌ర్ స్టైలిష్, ఏకాగ్ర‌త‌, మంచి నైపుణ్యం ఉన్న న‌టి. ఆమెతో నాకు ప‌రిచ‌యం ఉండ‌డం నా అదృష్టం అని త‌మన్నా ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన సామ్‌.. నువ్వు నా డార్లింగ్‌వి. మంచి మాట‌లు చెప్పావు. ల‌వ్యూ బేబి అని రిప్లై ఇచ్చింది. కొద్ది రోజులుగా స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా సైలెంట్ కాగా, రెండు రోజుల క్రిత‌మే గాఢ నిద్ర నుండి మేల్కొన్నానంటూ ట్వీట్ చేసింది. 


logo