బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 09, 2020 , 23:31:48

ఐటెమ్‌ కాదు.. సెలబ్రేషన్‌ సాంగ్‌!

ఐటెమ్‌ కాదు.. సెలబ్రేషన్‌ సాంగ్‌!

అగ్ర కథానాయికలు ప్రత్యేకగీతాల్లో నర్తించడం సాధారణ విషయయే. ఈ ట్రెండ్‌ గత కొన్నేళ్లుగా ఊపందుకుంది. ఈ ఒరవడిలోనే చెన్నై సోయగం రెజీనా తొలిసారి ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించింది. అదీ మెగాస్టార్‌ చిరంజీవి సరసన కావడం విశేషం. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శత్వంలో ‘ఆచార్య’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో రెజీనా ప్రత్యేకగీతాన్ని చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాకిది తొలిప్రత్యేకగీతం. బహుశా ఇదే చివరిది కావొచ్చేమో. మెగాస్టార్‌తో కలిసి డ్యాన్స్‌ అనగానే మరోమాట లేకుండా ఒప్పుకున్నా. అయితే ఈ పాటను ఐటెమ్‌సాంగ్‌ అనడం కంటే సెలబ్రేషన్‌ సాంగ్‌ అనడం బాగుంటుంది. చిరంజీవి నృత్యాల్లోని ైస్టెల్‌, పరిపూర్ణత చూసి ముచ్చటేసింది. నేను చేసిన డ్యాన్స్‌తో పాటు కళ్లతో పలికించిన హావభావా లు చాలా బాగున్నాయని చిరంజీవి మెచ్చుకున్నారు. నా జీవితం లో అత్యుత్తమ ప్రశంస అదే అనుకుంటున్నా’ అని సం బరపడిపోతోంది రెజీ నా. ప్రస్తుతం ఆమె ‘నేనే నా’ అనే సినిమాలో నటిస్తోంది.
logo