శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 11:56:37

మ‌హేష్‌- న‌మ్ర‌త న‌టించిన తొలి చిత్రానికి 20 ఏళ్ళు

మ‌హేష్‌- న‌మ్ర‌త న‌టించిన తొలి చిత్రానికి 20 ఏళ్ళు

వెండితెర‌పై క్యూట్ పెయిర్‌గా ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన‌ మ‌హేష్ బాబు- న‌మ్ర‌త శిరోద్క‌ర్‌లు తొలి సారి వంశీ సినిమా కోసం ప‌ని చేశారు. ఇదే స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డ్డారు. ఈ చిత్రం త‌ర్వాత ఐదేళ్ళ‌కు వీరిరివురు వివాహం చేసుకున్నారు. మ‌హేష్‌- న‌మ్ర‌త జోడీని ఒక్క‌టి చేసిన వంశీ చిత్రం అక్టోబ‌ర్ 4,2000న విడుద‌ల కాగా నేటితో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. బి. గోపాల్ దర్శకత్వంలో పద్మాలయ స్టూడియోస్ పతాకంపై జి. ఆదిశేషగిరిరావు నిర్మించాడు. చిత్రంలో కృష్ణ కీల‌క పాత్ర‌లో క‌నిపించి అల‌రించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు.

వంశీ సినిమా మ‌హేష్- న‌మ్ర‌త‌ల‌కు మంచి సక్సెస్ అందించ‌క‌పోయిన వారిద్ద‌రిని జీవిత భాగ‌స్వాములు అయ్యేలా చేసింది. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ కోసం టీం అంతా న్యూజిలాండ్ వెళ్ళి 25 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఆ షూటింగ్ స‌మ‌యంలో మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల మ‌ధ్య స్నేహం, ప్రేమ చిగురించాయి. న్యూజిలాండ్ నుండి వ‌చ్చిన త‌ర్వాత ఓ రోజు న‌మ్ర‌త‌.. మ‌హేష్‌కు కాల్ చేసి త‌న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చింది. మ‌హేష్ కూడా వెంట‌నే ఓకే అనేశాడు. దీంతో ఫిబ్ర‌వరి 10,2005న మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల వివాహం జ‌రిగింది. 2000 సంవ‌త్స‌రంలో ప్రేమ‌లో ప‌డ్డ వారు 2005లో వివాహం చేసుకోవ‌డానికి కార‌ణం న‌మ్ర‌త ప‌లు సినిమాల‌తో బిజీగా ఉండ‌డం, మ‌హేష్ స‌క్సెస్ వ‌చ్చాక పెళ్లి చేసుకోవాల‌ని భావించ‌డం వ‌ల‌న ప్రేమ‌లో ప‌డ్డ నాలుగేళ్ళ త‌ర్వాత పెళ్లి పీటలెక్కారు. 


logo