టాలీవుడ్ స్టార్ హీరో (Tollywood) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు సంబంధించిన అప్ డేట్ వచ్చిందంటే చాలు అభిమానులు పండగే. ఇక పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ బర్త్ డే త్వరలోనే రాబోతుందని తెలిసిందే. సెప్టెంబర్ 2న అభిమానులకు డబుల్ బొనాంజా అందించేందుకు రెడీ అయ్యాడట పవన్. పవన్, రానా కాంబినేషన్ లో వస్తున్న అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ (Ayyappanum Koshiyum Remake) ప్రాజెక్టు నుంచి మొదటి పాటను పుట్టినరోజున విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్టు సమాచారం.
కాగా రెండో అప్ డేట్ ఏంటంటే..హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న పీఎస్పీకే 28 (PSPK28) చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల కానుందట. మొత్తానికి సెప్టెంబర్ 2న ఓ వైపు పవన్ కల్యాణ్ పుట్టినరోజుతోపాటు రెండు సినిమాలకు సంబంధించిన రషెస్ విడుదల కాబోతున్నాయని వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ప్రస్తుతం సాగర్ చంద్ర డైరెక్షన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తో బిజీగా ఉన్నాడు పవన్‌కల్యాణ్.
మరోవైపు క్రిష్ తో పాన్ ఇండియా ప్రాజెక్టు హరిహరవీరమల్లు సినిమా చేస్తున్నాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పిస్తుండగా..వి దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్