బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 10:46:35

ఛ‌త్ర‌ప‌తి @ 15

ఛ‌త్ర‌ప‌తి @ 15

ప్ర‌భాస్,శ్రియ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ఛ‌త్ర‌ప‌తి. 2005లో విడుద‌లైన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ప్ర‌భాస్ న‌ట‌న‌, శ్రియ అందాలు, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ సినిమాని ఓ రేంజ్‌లో నిలిపాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్ర‌భాస్‌కి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచింది. దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికొచ్చినా గూండాయిజానికొచ్చినా గ్రూపులు కట్టడానికొచ్చినా పూటకో శవం లెక్కన పోర్టుకు బలువుతారు తీరం ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతుంది అంటూ ప్ర‌భాస్ చెప్పిన డైలాగ్‌కు అభిమానులు ఇప్ప‌టికీ పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. 

ఛ‌త్ర‌ప‌తి సినిమా కోసం కీర‌వాణి అందించిన సంగీతం కూడా సినిమా స‌క్సెస్‌లో స‌గ‌భాగం అయింది. నేటితో ఈ చిత్రం 15 సంవ‌త్సరాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌భాస్ అభిమానులు 15YearsForBBChatrapathi అనే హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ప్ర‌భాస్-రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బాహుబ‌లి చిత్రం బాక్సాఫీస్ వద్ద సేన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్ల‌లు దాటించింది. 


logo