శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 21:19:37

సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు

సమ్మర్ 2021 హౌజ్ ఫుల్..వేసవిలో 15 సినిమాలు

తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి తర్వాత అంతగా కలిసొచ్చే సీజన్ సమ్మర్. అప్పుడు సినిమాలు విడుదల చేయాలని ఆర్నెళ్ళ ముందుగానే ఖర్చీఫ్ వేసుకుని కూర్చుంటారు నిర్మాతలు. అయితే 2020 సమ్మర్ సీజన్ మాత్రం కరోనా పుణ్యమా అని తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఈ సారి సమ్మర్ సీజన్ అంతా నిండిపోయింది. ఒకటి రెండు కాదు దాదాపు 15 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో కొన్ని డేట్స్ కన్ఫర్మ్ చేసుకుంటే.. మరికొన్ని మాత్రం సమ్మర్‌లో వస్తామంటూ అనౌన్స్ చేసారు. చిరంజీవి నుంచి కార్తికేయ లాంటి చిన్న హీరో వరకు అందరి చూపులు కూడా సమ్మర్ సీజన్‌పైనే ఉన్నాయి. మరి ఈ సారి సమ్మర్ సీజన్ ఎలా ఉండబోతుంది..? ఏయే సినిమాలు రానున్నాయి..? 

1. కెజియఫ్ ఛాప్టర్ 2: యశ్ హీరోగా వస్తున్న ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది. వీలైనంత వరకు మేలో సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. 

2. చిరంజీవి ఆచార్య: చిరంజీవికి బాగా కలిసొచ్చిన మే 9 ఆచార్యను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ.

3. వకీల్ సాబ్: పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కూడా ఎప్రిల్ తొలివారంలోనే విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. 

4. రాధే శ్యామ్: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ జూన్ లో విడుదల కానుంది.

5. బాలయ్య, బోయపాటి సినిమా: సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మే మధ్యలో విడుదల కానుందని తెలుస్తుంది. 

6. టక్ జగదీష్: నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ ఎప్రిల్ 16న డేట్ లాక్ చేసుకున్నాడు. 

7. లవ్ స్టోరీ: ఫిదా తర్వాత మూడున్నరేళ్ళు గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ ఎప్రిల్ లో విడుదల కానుంది. 

8. విరాట పర్వం: సాయి పల్లవి, రానా కీలక పాత్రల్లో వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న విరాట పర్వం జూన్ విడుదలకు సిద్ధమవుతుంది. 

9. అరణ్య: మార్చ్ 26న నితిన్ రంగ్ దే సినిమాతో పోటీగా వస్తుంది రానా అరణ్య. 

10. నారప్ప: వెంకటేష్ నటిస్తున్న అసురన్ రీమేక్ నారప్ప కూడా మేలోనే విడుదల కానుంది. 

11. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్: అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎప్రిల్‌లో విడుదల కానుంది.

12. చావు కబురు చల్లగా: కార్తికేయ హీరోగా బన్నీ వాసు నిర్మిస్తున్న చావు కబురు చల్లగా ఎప్రిల్ చివరి వారంలో విడుదల కానుంది. 

13. రంగ్ దే: నితిన్ సినిమా ఇప్పటికే మార్చ్ 26న విడుదల తేదీ ఖాయం చేసుకుంది. 

14. శ్రీకారం: మహా శివరాత్రి కానుకగా శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం మార్చ్ 11న విడుదల కానుంది. 

15. ఖిలాడీ: రవితేజ క్రాక్ తర్వాత నటిస్తున్న ఖిలాడీ కూడా ఇదే సమ్మర్‌లో రానుంది. రమేష్ వర్మ దీనికి దర్శకుడు. ఈ చిత్రం మేలో విడుదల కానుంది

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo