గురువారం 02 ఏప్రిల్ 2020
Cinema - Feb 16, 2020 , 23:16:02

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘14’

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘14’

రతన్‌, విశాఖ జంటగా నటిస్తున్న చిత్రం ‘14’. నోయల్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. లక్ష్మి శ్రీనివాస్‌ దర్శకుడు. రాయల్‌ పిక్చర్స్‌ పతాకంపై సుబ్బారావు రాయన, శివకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పోస్టర్‌ చాలా కొత్తగా ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఉంది. నటీనటులందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘ఓ కొత్త పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. కథానుగుణంగా టైటిల్‌ పెట్టాం’ అని దర్శకుడు తెలిపారు. పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్‌ ఆచార్య, మహేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయినాథ్‌, సంగీతం: ఎర్త్‌సౌండ్స్‌, మాటలు: ఆదిత్యభార్గవ్‌, రచన-దర్శకత్వం: లక్ష్మిశ్రీనివాస్‌.logo
>>>>>>