గురువారం 21 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 09:55:21

ఈ వారం నామినేష‌న్‌లో ఎవరెవ‌రు ఉన్నారంటే..!

ఈ వారం నామినేష‌న్‌లో ఎవరెవ‌రు ఉన్నారంటే..!

సోమ‌వారం అంటేనే నామినేష‌న్ రచ్చ ఉంటుంది. ఇందులో భాగంగా 13వ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ కోసం ఇంటి స‌భ్యులు క‌ల‌ర్ ట్యూబ్స్ మెడ‌లో వేసుకొని ఎవ‌రినైతే నామినేట్ చేయాల‌నుకుంటున్నారో వారి ఎదురుగా ఉన్న వాట‌ర్ బౌల్‌లో రంగు నీళ్ళ‌ని పోయాల్సి ఉంది. ఎక్కువ క్వాంటిటీ నీళ్ళు ఎవ‌రి బౌల్‌లో ఉంటాయో వారిలో న‌లుగురు నామినేట్ అవుతార‌ని బిగ్ బాస్ చెప్పారు. అయితే ఒక్కో కంటెస్టెంట్ ఇద్ద‌రు లేదా ఎక్కువ మందిని కూడా నామినేట్ చేయోచ్చు అన్నారు. 

నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా హారిక.. అవినాష్- అభిజిత్‌, అవినాష్.. మోనాల్- అఖిల్, అఖిల్.. అవినాష్, మోనాల్, అభిజిత్.. మోనాల్- హారిక, మోనాల్.. అవినాష్- అభిజిత్- అఖిల్, అరియానా.. హారిక-మోనాల్- సొహైల్, సొహైల్.. అవినాష్- అరియానాల‌ను నామినేట్ చేసుకున్నారు. అంటే 13 వారం లో అవినాష్, మోనాల్, అభిజిత్, హారిక, అఖిల్ ఈ ఐదుగురిలో ఒక‌రు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు

ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఊహించ‌ని ట్విస్ట్‌లు ఇచ్చారు హౌజ్‌మేట్స్. హారిక‌.. అభిజీత్‌ని నామినేట్ చేయ‌గా, అభీ కూడా హారిక‌ని నామినేట్ చేశాడు.ఇక అఖిల్‌, మోనాల్‌లు కూడా ఒక‌రినొక‌రు నామినేట్ చేసుకున్నారు. ముందుగా నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు పెట్టిన హారిక గ‌త వారం ప‌రిస్థితుల‌ని దృష్టిలో పెట్టుకొని అభిజిత్‌ని నామినేట్ చేసింది. అనంత‌రం కెమెరా ముందుకు వ‌చ్చి కన్ఫెష‌న్ రూంలో జ‌రిగిన దానికి కాదు. మిగ‌తా వారిలో ఏం త‌ప్పులు క‌నిపించ‌డం లేదంటూ చెప్పుకొచ్చింది. ఇక హౌజ్‌ని వీడేముందు తాను చేయాల్సింది ఒక‌టి ఉంది, అది చేస్తే ఎప్పుడు వెళ్లిన సంతోషంగా వెళ‌తానంటూ స్ప‌ష్టం చేసింది హారిక‌. ఇక ఎవిక్ష‌న్ పాస్ విష‌యంలో అసంతృప్తిగా ఉన్నావు అనిపిస్తుంది అవినాష్‌. అందుకే నిన్ను నామినేన్ చేస్తున్నానని చెప్పింది హారిక‌


logo