బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 04, 2020 , 11:32:19

‘12 o క్లాక్‌’తో భయపెడుతున్న రామ్‌గోపాల్‌ వర్మ

‘12 o క్లాక్‌’తో భయపెడుతున్న రామ్‌గోపాల్‌ వర్మ

హైదరాబాద్‌ : దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో, ఎప్పుడో కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. తాజాగా వర్మ మరో సినిమాని చేస్తున్నట్టు చెప్పాడు. అంతే కాదు ఆ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సైతం విడుదల చేశాడు. ప్రేక్షకులను భయపెట్టి చాలా రోజులైంది అనుకున్నాడో ఏమో కానీ '12 O క్లాక్' అనే పేరుతో ఓ హారర్ సినిమాని అనౌన్స్ చేశాడు వర్మ. గతంలో 'రాత్రి', 'భూత్' వంటి హారర్ చిత్రాలను తెర‌కెక్కించిన వర్మ ప్రస్తుతం '12 O క్లాక్' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. టీజర్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని మూవీని కంపెనీ ప్రొడ‌క్షన్‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తుండ‌గా, ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.

ఇది షార్ట్ ఫిల్మ్ కాదని 1 గంట 45 నిముషాలు ఉండే ఫుల్ లెన్త్ సినిమా అని వర్మ తెలిపాడు. ఈ చిత్రానికి సంబంధించిన వేశేషాలను ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నాడు. లాక్‌డౌన్‌లో అందరూ సినిమాలను పక్కన పెడితే వర్మ మాత్రం వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. 'క్లైమాక్స్, నగ్నం చిత్రాలను 'ఆర్జీవీ వరల్డ్ - శ్రేయాస్ ఈటీ'లో విడుదల చేశాడు. మర్డర్, పవర్ స్టార్ సినిమాలను సైతం త్వరలో విడుదల చేయనున్నాడు వర్మ.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo