సోమవారం 01 మార్చి 2021
Cinema - Dec 16, 2020 , 00:06:45

ఎవరు..ఎక్కడ..ఎందుకు

ఎవరు..ఎక్కడ..ఎందుకు

అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’. ‘హూ వేర్‌ వై’ ఉపశీర్షిక. కె.వి.గుహన్‌ దర్శకుడు. రామంత్ర క్రియేషన్స్‌ పతాకంపై రవి.పి.రాజు దాట్ల నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ “118’ సక్సెస్‌ తర్వాత గుహన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో డిఫరెంట్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. తమ జీవితంలో ఎదురైన ప్రశ్నలకు సమాధానాల్ని అన్వేషిస్తూ ఓ జంట సాగించే ప్రయాణం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రం నవ్యానుభూతిని పంచుతుంది. అదిత్‌ అరుణ్‌, శివాని రాజశేఖర్‌ పాత్రలు వినూత్న రీతిలో సాగుతాయి.  త్వరలో టైటిల్‌ లోగోను విడుదలచేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సైమన్‌ కె కింగ్‌, సంభాషణలు: మిర్చి కిరణ్‌. 

VIDEOS

logo