శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 09:55:01

100 మిలియ‌న్ వ్యూస్ సొంతం చేసుకున్న గున్న గున్న మామిడి సాంగ్

100 మిలియ‌న్ వ్యూస్ సొంతం చేసుకున్న గున్న గున్న మామిడి సాంగ్

అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ‌, మెహ‌రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ రాజా ది గ్రేట్‌. చిత్రంలో అంధుడిగా ర‌వితేజ అద్భుత న‌టనా ప‌టిమ క‌న‌బ‌రిచాడు. మిగతా పాత్ర‌ధారులు కూడా వారి వారి పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించారు. సాయి కార్తీక్ సంగీతం సినిమాకి మ‌రో అద‌న‌పు బ‌లం అని చెప్ప‌వ‌చ్చు. 2017 అక్టొబరు 18న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ళు రాబ‌ట్టింది.

రాజా ది గ్రేట్ చిత్రంలోని గున్న గున్న మామిడి సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఈ సాంగ్‌ని కామెడీ ప‌రంగా తెర‌కెక్కించాడు అనీల్ రావిపూడి. తాజాగా ఈ సాంగ్ వీడియో వంద మిలియ‌న్ వ్యూస్ రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని నిర్మాణ సంస్థ పోస్ట‌ర్ విడుదల చేస్తూ తెలియ‌జేసింది. మీరు ఈ సాంగ్‌ని మ‌రోసారి చూసి ఆనందించండిలోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo