బుధవారం 24 ఫిబ్రవరి 2021
Cinema - Jan 28, 2021 , 16:30:44

20 నిమిషాలు..కోటి రెమ్యున‌రేష‌న్..!

20 నిమిషాలు..కోటి రెమ్యున‌రేష‌న్..!

మెగాస్టార్ చిరంజీవి-కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం ఆచార్య‌. రాంచ‌ర‌ణ్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ మూవీలో అందాల భామ పూజాహెగ్డే కీ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఒక‌టి ఫిలింన‌గర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే గ్రామీణ యువ‌తిగా క‌నిపిస్తుంద‌ట‌. ఇలాంటి పాత్ర‌లో న‌టించ‌డం పూజాకు తొలిసారి.

ఆచార్యలో పూజాహెగ్డే పాత్ర నిడివి 20 నిమిషాలుండ‌గా..పెద్ద మొత్తంలోనే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం పూజాహెగ్డే ఈ రోల్ కోసం రూ. కోటి రెమ్యున‌రేష‌న్ ఇంటికి తీసుకెళ్తుంద‌ని ఇన్‌సైట్ టాక్‌. రాంచ‌ర‌ణ్ ఇప్ప‌టికే రంగ‌స్థ‌లం చిత్రంలో జిగేల్ రాణి సాంగ్‌లో పూజాహెగ్డేతో క‌లిసి చిందులేశాడు. ఆ త‌ర్వాత ఇపుడు రాంచ‌ర‌ణ్ కు జోడీగా కీ రోల్ లో క‌నిపించే ఛాన్స్ కొట్టేసింది. 

తెలుగు, హిందీలో త‌న హ‌వా కొన‌సాగిస్తున్న ఈ బ్యూటీకి కోట్లాదిమంది ఫాలోవ‌ర్లున్నారు. పూజాహెగ్డేకున్న‌ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా మేక‌ర్స్ పెద్ద మొత్తంలో రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి..

జాన్వీక‌పూర్ కు 'వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ' న‌చ్చ‌లేదా..? 

శృతిహాస‌న్ ప్రియుడు ఇత‌డే..ఫాలోవ‌ర్స్ కు క్లారిటీ!

‘ఓటిటి’ కాలం మొద‌లైన‌ట్టేనా..?

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

పూజాహెగ్డే డిమాండ్‌..మేక‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య‌త్రిపాఠి ఒకే..? 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo