సీనియర్ కథానాయకుల్లో వెంకటేష్ పంథా విభిన్నంగా ఉంటుంది. ఇమేజ్ పట్టింపులు, వాణిజ్య సూత్రాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే నవతరం దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతుంటారాయన. తాజాగా దర్శకుడు వెంకటేష్ మహాతో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కేరాఫ్ కంచెరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నారు వెంకటేష్ మహా. కుటుంబ బంధాలకు నవ్యమైన అంశాల్ని మేళవిస్తూ అతడు సిద్ధంచేసిన కథ నచ్చడంతో హీరో వెంకటేష్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలకాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ ‘ఎఫ్-3’, ‘నారప్ప’, ‘దృశ్యం-2’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.