ఈద్ కి షారూఖ్ ఇవ్వబోతున్న గిఫ్ట్ ఏంటో తెలుసా ?

Wed,June 13, 2018 05:28 PM
Zero Movie another teaser released for eid

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ క్రేజీ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం జీరో. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షారూఖ్ సరసన అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్రంలో షారూఖ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడు. 2018 డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ప్రయోగాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ఇటీవల విడుదలై అభిమానులలో మంచి జోష్ తెచ్చింది.

ఈద్ కానుకగా చిత్ర టీజర్ మరొకటి విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచేలా టీం సరికొత్త ప్లాన్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. చిత్రంలో సూపర్ స్టార్ పాత్ర పోషిస్తున్నారు కత్రినా. ఆమె ప్రేమను గెలుచుకోవాలని షారుక్ ప్రయత్నిస్తుంటారు. మరోపక్క అనుష్క మానసిక దివ్యాంగురాలి పాత్రలో కన్పించనున్నారు. 2012లో వచ్చిన జబ్ తక్ హై జాన్ చిత్రంతో అలరించిన షారూఖ్ సరసన అనుష్మ శర్మ, కత్రినా కైఫ్ కాంబో , ఇప్పుడు జీరో కోసం మరోసారి జతకట్టారు . షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, ఆనంద్ ఎల్ రాయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, శ్రీదేవి, రాణీ ముఖర్జీ, కాజోల్ తదితరులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.

2258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS