బయోపిక్‌లో మోదీ త‌ల్లి, భార్య ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల‌

Sun,February 17, 2019 07:18 AM
Zarina Wahab to Play Prime Ministers Mother

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవిత నేప‌థ్యంలో ఒమంగ్ కుమార్ ‘పీఎం నరేంద్రమోదీ’ పేరుతో బ‌యోపిక్‌ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుద‌ల కానున్న ఈ చిత్రంలోని పాత్ర‌ల‌కి సంబంధించిన లుక్స్ విడుద‌ల చేస్తూ మూవీపై అంచనాలు పెంచుతున్నారు మేక‌ర్స్. ఇటీవ‌ల భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్‌ షా పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆయన పాత్రలో టీవీ న‌టుడు మనోజ్ ‌జోషి నటిస్తున్నారు. ఇక తాజాగా మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ, భార్య జశోదాబెన్ పాత్ర‌లో న‌టిస్తున్న వారి లుక్స్ విడుద‌ల చేశారు. హీరాబెన్‌ పాత్రలో ప్రముఖ సీనియర్ నటి జరీనా వాహబ్ న‌టిస్తుండ‌గా, జశోదాబెన్‌ పాత్రలో బర్ఖా బిస్త్ సేన్‌గుప్తా నటిస్తున్నారు. ఇద్దరి పాత్ర‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇక మోదీ పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు సీనియ‌ర్ న‌టులు కూడా చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏడాది ద్వితీయార్ధంలో ‘పీఎం నరేంద్రమోదీ’ బ‌యోపిక్ విడుద‌ల కానుంది. 23 భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు టాక్.

1960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles