రానా, సాయి ప‌ల్ల‌వి చిత్రంలో సీనియ‌ర్ బాలీవుడ్ న‌టి

Wed,May 1, 2019 09:36 AM

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న పీరియ‌డ్ డ్రామా విరాట‌ప‌ర్వం 1992. నీది నాది ఒకే కథతో విమర్శకుల మెప్పు పొందిన వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డి.సురేష్‌బాబు నిర్మాత. ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సీనియర్‌ కథానాయిక టబు, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. జ‌రీనా గ‌తంలో గాజుల కిష్ట‌య్య‌, అమ‌ర ప్రేమ‌, హేమాహేమీలు త‌దిత‌ర చిత్రాల‌లో న‌టించింది. 2010లో వచ్చిన ఆర్జీవి ర‌క్త చ‌రిత్ర సినిమాలోను న‌టించారు జ‌రీనా. ఇప్పుడు విరాట ప‌ర్వంలోను జ‌రీనా కీల‌క పాత్ర పోషిస్తుంద‌ట‌. జూన్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో ట‌బు మానవ హక్కుల కోసం పోరాటం చేసే మహిళ పాత్రని పోషిస్తున్నట్టు సమాచారం.

1741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles