బిగ్‌బాస్ జంట ప్రీవెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు వైరల్

Thu,October 11, 2018 03:50 PM
yuvika chawdary-prince narula pre wedding photos goes viral

ప్రముఖ హిందీ ఛానల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ 9వ సీజన్‌లో కంటెస్టంట్లు ప్రిన్స్ నరులా, యువికా చౌదరి ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ జంట తమ నిశ్చితార్థం విషయాన్ని గత జనవరిలో అధికారికంగా ప్రకటించింది. ఈ జంట శుక్రవారం రోజు ఓ ఇంటివారు కానున్నారు. ప్రిన్స్, యువికా తమ పెళ్లి వేడుకకు ఇప్పటికే గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసుకున్నారు.

బుధవారం ఈ కొత్త జంట మెహిందీ వేడుకలు జరుపుకుంది. యువికా చౌదరి నియోన్ గ్రీన్ లెహెంగా, పూలతో డైజైన్ చేసిన ఆభరణాలు ధరించి స్టన్నింగ్ లుక్‌తో అదరగొట్టింది. ప్రిన్స్ నరులా సాంప్రదాయ కుర్తా ఫైజామాతో మెరిసిపోయాడు. ఇద్దరూ కలిసి కొన్ని పాటలకు డ్యాన్స్ కూడా చేశారు. యువికా చౌదరి, ప్రిన్స్ నరులా ప్రీవెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.


5299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles