అల్లు శిరీష్ యుద్ధ భూమి ట్రైలర్ విడుద‌ల‌

Fri,February 23, 2018 11:56 AM
Yuddha Bhoomi Official Theatrical Trailer

1971 బియాండ్ బోర్డర్స్ అనే చిత్రంతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్‌. ఇప్ప‌టికే ఈ చిత్రం మ‌ల‌యాళంలో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషించాడు. మేజర్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1970కి ముందు ఇండియా బార్డ‌ర్‌లో ఏం జ‌రిగింది? అన్న ఆస‌క్తిక‌ర క‌థాంశంతో రూపొందింది. శిరీష్ ఓ యుద్ధ సైనికుడి పాత్ర పోషించ‌గా, అరుణోదయ్ సింగ్, రెంజీ పనీకర్ మరియు సుధీర్ కర్మణ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించారు. తెలుగులో ఈ చిత్రం యుద్ధ భూమి అనే టైటిల్ తో విడుదల కానుంది. ముందుగా 1971 భార‌త స‌రిహ‌ద్దు అనే టైటిల్ ఫిక్స్ చేసిప్ప‌టికి , తాజాగా పేరు మార్చి 1971 భార‌త స‌రిహ‌ద్దుని ట్యాగ్‌లైన్‌గా పెట్టారు . ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీజ్యోతి క్రియేష‌న్స్ మ‌ల‌యాళ‌ మూవీని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నుంది. కొద్ది సేప‌టి క్రితం మూవీ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులోని స‌న్నివేశాల‌తో పాటు డైలాగ్స్ అభిమానులు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. మోహ‌న్ లాల్‌కి తెలుగులో మంచి క్రేజ్ ఉండ‌టంతో పాటు శిరీష్ నటించిన తాజా చిత్రం ఒక్క క్ష‌ణం స‌క్సెస్ యుద్ధ భూమి విజ‌యానికి హెల్ప్ అవుతాయ‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

1341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS