ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలనుంది..'యాత్ర' ట్రైలర్

Mon,January 7, 2019 05:31 PM
YSR Biopic yatra trailer released

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహీ వీ రాఘవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 'నా విధేయతని, విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి. నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ..జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవాలనుంది..వినాలనుంది. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలనుంది' అంటూ ట్రైలర్ లో వచ్చే సంభాషణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

వైఎస్ఆర్ పాత్రలో లెజెండరీ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా..రావు రమేశ్, సుహాసిని, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్‌ కనిపించనున్నారట. ఈ మూవీని విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాత్ర 2019 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1896
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles