'యాత్ర' చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపిన జ‌గ‌న్

Sun,February 10, 2019 10:08 AM

దివంగ‌త నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాదయాత్రలోని భావోద్వేగ సన్నివేశాల సమాహారంగా సాగిన చిత్రం యాత్ర ఈ శుక్ర‌వారం విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. వై.ఎస్ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన పాదయాత్రని ప్రధాన కథగా ఎంచుకుని చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించారు. దీంతో ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆయ‌న జీవితాన్ని సినిమాగా తెరకెక్కించటంలో మీరు చూపించిన అభిరుచి, అకింతభావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు అంటూ చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులను త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా అభినందించారు జ‌గ‌న్. యాత్ర చిత్రంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్రని మ‌మ్ముట్టి పోషించ‌గా, ఆయ‌న స్నేహితుడు కేవీపి పాత్ర‌లో రావు ర‌మేష్ క‌నిపించారు. రాజశేఖరరెడ్డి చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి పాత్ర‌ని సుహాసిని చేశారు. మహి వీ రాఘవ దర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు.




2826
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles