ఇప్పుడు యూట్యూబ్ లో నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్ వీడియో ఇది

Sun,July 16, 2017 04:59 PM
youtube number one trending video

యూట్యూబ్ అంటేనే... అదో వీడియోల స‌ముద్రం. మ‌రి.. ఆ స‌ముద్రంలోకి రోజుకు కొన్ని వేల‌, ల‌క్ష‌ల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. అయితే... యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియోల్లో దేనికి ఎక్కువ‌గా వ్యూస్, కామెంట్స్, లైక్స్ గ‌ట్రా వ‌స్తే దాన్ని నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్ వీడియో కింద ప‌రిగ‌ణిస్తారు. అయితే.. గ‌త నాలుగు రోజుల నుంచి మాత్రం ఒకే ఒక వీడియో యూట్యూబ్ లో నెంబ‌ర్ వ‌న్ ట్రెండింగ్ లో కొన‌సాగుతున్న‌ది. అదే.. బెల్లంకొండ శ్రీనివాస్, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న మూవీ జ‌య జాన‌కీ నాయ‌క మూవీ టీజ‌ర్. జులై 11న ఈ మూవీ టీజ‌ర్ రిలీజ‌వ‌గా... ఇప్ప‌టికి ఈ టీజ‌ర్ ను దాదాపు 17 ల‌క్ష‌ల మంది చూశారు. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ డీఎస్పీ. మ‌రో హీరోయిన్ గా ప్ర‌గ్యా జైస్వాల్ కూడా నటిస్తున్న‌ది. ఆగ‌స్టు 11 న ఈ మూవీ రిలీజ‌వనుంది.

3135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS