సుభాష్ చంద్ర‌బోస్ గెట‌ప్‌లో ఎన్టీఆర్ త‌న‌యుడు

Thu,August 15, 2019 11:36 AM
Young Tiger NTR posted this cute pic of Abhay Ram

ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే సుభాష్ చంద్ర‌బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఆయ‌న గెట‌ప్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌యుడు అభ‌య్ రామ్ ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఇండిపెండెన్స్ డే సంద‌ర్బంగా త‌న‌యుడిని సుభాష్ చంద్ర‌బోస్‌లా మార్చి ఆయ‌న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు ఎన్టీఆర్. అభ‌య్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది.

ఎన్టీఆర్, ప్ర‌ణ‌తి దంప‌తులుకి 2018, జూన్ 14న రెండో కుమారుడు జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. ఆ చిన్నారికి భార్గ‌వ్ రామ్ అని నామ‌క‌ర‌ణం చేసిన ఎన్టీఆర్ అప్ప‌ట్లో కంప్లీట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేశాడు. ఈ పిక్ నంద‌మూరి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఎన్టీఆర్ పెద్ద‌ కొడుకు అభయ్ రామ్ 2014 జులై 22 లో జన్మించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

View this post on Instagram

#JaiHind

A post shared by Jr NTR (@jrntr) on

3110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles