గుర్రాన్ని మ‌చ్చిక చేసుకుంటున్న ఎన్టీఆర్

Thu,June 27, 2019 09:29 AM
Young Tiger Jr.NTR Playing With Horse

యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో చెర్రీ సంద‌డి చేయ‌నుండ‌గా, కొమురం భీంగా ఎన్టీఆర్ అల‌రించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ పాల్గొంటున్న‌ట్టు స‌మాచారం. అయితే తాజాగా ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. వీడియోలో ఎన్టీఆర్ గుర్రాన్ని మ‌చ్చిక చేసుకుంటున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. కొమురం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ త‌న విశ్వ‌రూపాన్ని చూపించ‌డం ఖాయ‌మ‌ని ఫ్యాన్స్ అంటున్నారు. చిత్రంలో చెర్రీ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఎన్టీఆర్‌తో న‌టించే భామ ఎవ‌రో తెలియాల్సి ఉంది. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, సముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల‌లో న‌టించ‌నున్నారు. జూలై 30 .. 2020వ సంవత్సరంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.



2654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles