వెరిఫై అయిన‌ ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌

Sun,April 21, 2019 07:09 AM
Young Rebel Star Prabhas instagram account verified

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ప్ర‌భంజ‌నం ఏ ర‌కంగా సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. సామాన్యుడి నుండి సెల‌బ్రిటీల వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో స‌గం స‌మ‌యం గ‌డుపుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే సెల‌బ్రిటీలకి ఫాలోవ‌ర్స్ అధికంగా ఉండ‌డం వ‌ల‌న వారి ఎకౌంట్‌కి బ్లూ టిక్ మార్క్ ఎసైన్ చేస్తారు సోష‌ల్ మీడియా నిర్వాహ‌కులు. ఇటీవ‌ల ప్ర‌భాస్ త‌న అభిమానుల కోరిక మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బాహుబ‌లికి సంబంధించి ఓ ఫోటో కూడా పోస్ట్ చేశాడు. అయితే ఆ అకౌంట్ వెరిఫై కాక‌పోవ‌డంతో అది ప్ర‌భాస్ ఎకౌంటా కాదా అనే అనుమానం జ‌నాల‌లో ఉండేది.తాజాగా ఆయ‌న ఎకౌంట్ వెరిఫై కావ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు ఆయ‌న‌ని ఫాలో కావ‌డం మొద‌లు పెట్టారు. మ‌రి కొద్ది రోజుల‌లోనే ప్ర‌భాస్ 1 మిలియ‌న్ మార్క్ అందుకోనున్నాడు. ప్ర‌స్తుతం సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు ప్ర‌భాస్.

1386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles