సంక్రాంతి బ‌రిలో స్టార్ హీరోల‌తో పోటి ప‌డ‌బోతున్న కుర్ర హీరో

Wed,January 3, 2018 12:38 PM

ప్ర‌తి ఏడాది సంక్రాంతి బ‌రిలో బ‌డా సినిమాలు పోటి ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తొలి సారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అజ్ఞాత‌వాసి చిత్రంతో సంక్రాంతి బ‌రిలో దిగ‌బోతున్నాడు. ఈ చిత్రానికి పోటీగా బాలయ్య న‌టించిన జై సింహా, యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో సూర్య హీరోగా తెర‌కెక్కిన గ్యాంగ్ చిత్రాలు కూడా రాబోతున్నాయి. వీటి మ‌ధ్యే ఆస‌క్తిక‌ర పోటి ఉంటుందని అంద‌రు అనుకుంటే, స‌డెన్‌గా కుర్ర హీరో రాజ్ త‌రుణ్ త‌న తాజా చిత్రం రంగుల రాట్నంని సంక్రాంతి బ‌రిలో నిలిపేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఉయ్యాల జంపాల సినిమాతో రాజ్ త‌రుణ్‌కి తొలి అవ‌కాశం ఇచ్చిన అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ మూవీని నిర్మించ‌డం విశేషం. శ్రీ రంజని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిత్రా శుక్లా హీరోయిన్‌గా న‌టించింది. రాజ్ త‌రుణ్ కెరీర్ గ్రాఫ్ బాగుండ‌డం, ఈ హీరో సినిమా మినిమం హిట్ అవుతుంద‌నే టాక్ ఆడియ‌న్స్‌లో ఉండ‌డంతో పాటుగా అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించ‌డంతో రంగుల రాట్నంపై కూడా ఎక్స్ పెక్టేష‌న్స్ పెరిగాయి. గ‌త ఏడాది చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి పోటీగా వచ్చిన శర్వానంద్ ‘శతమానం భవతి’ పెద్ద విజయాన్ని అందుకోవ‌డంతో ఇప్పుడు రంగుల రాట్నం కూడా స‌క్సెస్ సాధిస్తుంద‌ని ఆశిస్తున్నారు.

1594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles