విషపూరిత ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్నానా ?

Tue,September 25, 2018 12:02 PM
young hero enter into vicious world

ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన కుర్ర హీరో నాగ‌శౌర్య‌. చివ‌రిగా ఛ‌లో అనే సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ హీరోకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ప్ర‌స్తుతం ఈ హీరో చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఈ హీరో త‌న ట్విట్ట‌ర్ ద్వారా విష‌పూరిత ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్నానా అని ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేశాడు . అందుకు కార‌ణం ఇన్నాళ్ళు స్మార్ట్‌ఫోన్‌కి దూరంగా ఉన్న నాగ శౌర్య ఇప్పుడు మొబైల్ ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలో తాను ఇలా ట్వీట్ చేశాడు. అయితే ప్ర‌స్తుత జీవన విధానంలో మొబైల్ అనేది అంద‌రికి నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌లో ఒక‌టి కాగా, ఇన్నాళ్ళ‌కి నాగ‌శౌర్య మొబైల్ ప్రపంచంలోకి అడుగుపెట్ట‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది.


3440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles