రాధార‌వికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన స‌మంత‌

Tue,March 26, 2019 12:09 PM
You are a sad man says samatha

నయనతార నటించిన కొలైయుదిర్ కాలమ్ ట్రైలర్ లాంఛింగ్‌లో రాధారవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌లు కోలీవుడ్‌లో దుమారాన్ని రేపాయి. రాధార‌వి వ్యాఖ్య‌ల‌ని త‌ప్పు ప‌డుతూ ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఆయ‌నపై మండిప‌డ్డారు. తాజాగా స‌మంత త‌న ట్విట్ట‌ర్‌లో రాధార‌వికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. రాధార‌వి గారు క‌ష్టం ఎప్ప‌టికి అలానే నిలిచిపోయి ఉంటుంది. మీరు చాలా బాధ‌లో ఉన్నారు. మీ బాధ చూసి మేము త‌ట్టుకోలేక‌పోతున్నాం. మీకు ప్ర‌శాంత‌త ల‌భించాల‌ని మేము కోరుకుంటున్నాం. న‌య‌న‌తార త‌ర్వాతి సూప‌ర్ హిట్ చిత్రానికి టికెట్స్ పంపిస్తాం. పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేయండి అని స‌మంత త‌న‌దైన స్టైల్‌లో రాధార‌వికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. రాధార‌వి వ్యాఖ్య‌ల‌కి నడిగర్‌ సంఘం ఇప్ప‌టికే ఆయ‌న‌కి నోటీసులు పంపిన సంగ‌తి తెలిసిందే. ఇక నుంచి ఆయనను సినిమాల్లోకి తీసుకోబోమని ఓ నిర్మాణ సంస్థ ప్రకటించింది.

2393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles