జిమ్మికి కమల్ పాట‌కి జ్యోతిక‌, మంచు ల‌క్ష్మీ స్టెప్పులు

Tue,November 13, 2018 01:20 PM
yotika & Lakshmi Manchu in Jimikki Kammal

మోహన్‌ లాల్‌ హీరోగా తెరకెక్కిన ‘వెలిపడింతే పుస్తకమ్‌’ సినిమాలోని జిమ్మికి కమల్ పాటకు కేర‌ళ‌లోని చిన్నా,పెద్దా ఎంత‌గా ఫిదా అయ్యారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఈ సాంగ్ యూత్‌ని బాగా ఊపేసింది. మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన ఈ పాట‌ని ప్ర‌స్తుతం ‘కాట్రిన్ మొజి’ సినిమా కోసం రీమిక్స్ చేశారు. అనీల్ ప‌న‌చూర‌న్ రీమిక్స్ సాంగ్‌కి లిరిక్స్ అందించ‌గా వినీత్ శ్రీనివాస‌న్‌, రెంజిత్ ఉన్ని క‌లిసి ఆల‌పించారు. స‌త్యం సంగీతం అందించారు. కొద్ది సేప‌టి క్రితం చిత్ర యూనిట్ త‌మిళ వ‌ర్షెన్ సాంగ్‌ని విడుద‌ల చేయ‌గా దీనికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. రాధా మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన కాట్రిన్ మొళి చిత్రం నవంబ‌ర్ 16న విడుద‌ల కానుండ‌గా, చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆ సాంగ్ విడుద‌ల చేశారు. ఆ సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి.

1784
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles