అఖిల్ నోట 'ఏవేవో క‌ల‌లు క‌న్నా' పాట‌

Fri,December 15, 2017 10:45 AM
అఖిల్ నోట 'ఏవేవో క‌ల‌లు క‌న్నా' పాట‌

హీరోలు సింగర్స్ గా మారుతున్న వేళ అక్కినేని వారసుడు అఖిల్ తన టాలెంట్ మొత్తాన్ని తొలి సారిగా సైమా వేదికపై చూపించాడు. జూన్ 30న జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుకలో అఖిల్ తన తాజా చిత్రం హలో మూవీలోని ఏవేవో కలలు కన్నా అనే పాటని లైవ్‌గా పాడి అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు. అఖిల్ పాడిన‌ ఈ పాటకి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధలయ్యారు. భవిష్యత్ లో ప్లే బాక్ సింగర్ గాను తప్పక అలరిస్తాడని ప్రశంసలు కురిపించారు. అనూప్ రూబెన్స్ సమకూర్చిన సంగీతం, అఖిల్ వాయిస్ రెండు కలగలియడంతో ఆ సాంగ్ కి ఎంతో అందం వచ్చింది. అయితే డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా అఖిల్ స్టూడియో వ‌ర్షెన్‌ సాంగ్‌ని రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ఇది ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంది. ఈ సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.

756

More News

VIRAL NEWS