యాత్ర అఫీషియ‌ల్ టీజ‌ర్ వచ్చేసింది

Sun,July 8, 2018 06:45 AM
Yatra Movie Teaser released

టాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా రూపొందుతున్న బ‌యోపిక్స్‌లో యాత్ర ఒకటి. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది. జూన్ 20న చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, వైఎస్ ఆర్ పాత్ర పోషిస్తున్న మ‌మ్ముట్టికి ఇటీవ‌ల‌ యూనిట్ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పింది. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, నేడు వైఎస్ఆర్ జ‌యంత‌ని పుర‌స్క‌రించుకొని యాత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని డైలాగ్స్ అభిమానుల‌ని అల‌రిస్తున్నాయి. పాద‌యాత్రకి బ‌య‌లు దేరేముందు స‌న్నివేశాల‌ని టీజ‌ర్‌లో అద్భుతంగా చూపించారు. యాత్ర సినిమా కోసం మహి వి రాఘవ ముఖ్య పాత్రలని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు, వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళి, షర్మిళ పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ముఖ్యంగా చూపించనున్నారని స‌మాచారం.

2076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS