ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు 'యాత్ర‌'

Sat,December 15, 2018 08:17 AM
yatra movie release date fixed

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న క్రేజీ బ‌యోపిక్స్‌లో యాత్ర ఒక‌టి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మహి.వి రాఘవ తెర‌కెక్కిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు. రావు రమేశ్, సుహాసిని, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్‌ కనిపించనున్నారట. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన‌సూయ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అయితే ఈ మూవీ రిలీజ్‌పై అభిమానుల‌లో అనేక సందిగ్ధాలు నెల‌కొన‌గా ఫిబ్ర‌వ‌రి 8న చిత్ర రిలీజ్‌కి ప్లాన్ చేశారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కులని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని అంటున్నారు.

1156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles