రిలీజైన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మోషన్ పోస్టర్

Mon,September 17, 2018 03:40 PM
Yashraj Films released Thugs Of Hindostan motion poster

బాలీవుడ్ సూపర్‌స్టార్స్ అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ కలిసి నటిస్తున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ మోషన్ పోస్టర్ విడుదలైంది. చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఫస్ట్ లోగోను రిలీజ్ చేసింది. విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 8న విడుదల కానుంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో ఇండియా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. 1839లో ఫిలిప్ మీడోస్ టేలర్ రాసిన కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ అనే నవల స్ఫూర్తితో సినిమాను రూపొందించారు. దేశంలో ఓ దోపిడీదారు, అతని గ్యాంగ్ కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ప్రధాన కథాంశంగా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌ను తెరకెక్కించారు.


నవంబర్ 8న దివాలీనాడు మూవీ రిలీజ్ కానుండటంతో ఇప్పటివరకు బాలీవుడ్‌లో వచ్చిన మూవీల ఓపెనింగ్ కలెక్షన్ల రికార్డులు బద్ధలవుతాయని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అంచనా వేశారు. తొలి రోజు కలెక్షన్లలో బాహుబలి 2 (రూ.41 కోట్లు)ను థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మించిపోతుందా అని తరణ్ ట్వీట్ చేశారు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ 3డీ, ఐమ్యాక్స్ ఫార్మాట్లలో హిందీతోపాటు తమిళ్, తెలుగులలో రిలీజ్ కానుంది.

1136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS