క‌న్నుమూసిన హీరో అభిమాని

Thu,January 10, 2019 10:45 AM

క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న ఇంటికి వెళ్లి విష్ చేసేందుకు శాంతినగరకు చెందిన రవి అనే వ్య‌క్తి ప్ర‌య‌త్నించ‌గా, అత‌నిని సెక్యూరిటీ సిబ్బంది అనుమ‌తించ‌లేదు. దీంతో మ‌న‌స్థాపానికి గురైన రవి అనే వ్య‌క్తి పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. 75 శాతం కాలిన గాయాల‌తో ఉన్న ర‌విని బెంగ‌ళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. య‌ష్ కూడా ఆస్ప‌త్రికి వెళ్లి అభిమానిని ప‌రామ‌ర్శించారు. అయితే ఐసీయూలో చికిత్స పొందుతున్న ర‌వి ఈ తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. విష‌యం తెలుసుకున్న య‌ష్ ర‌వికి సంతాపాన్ని తెలియ‌జేస్తూ, కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.


రాక్ స్టార్ య‌శ్ ప్ర‌తి ఏడాది త‌న ఇంటి ద‌గ్గ‌ర ఘ‌నంగా పుట్టిన రోజు వేడుకలు జ‌రుపుకునే వారు. కాని ఈ సారి అంబ‌రీష్ చనిపోయిన నేప‌థ్యంలో జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రుపుకునేందుకు ఆస‌క్తి చూప‌లేదు. ఈ విష‌యాన్ని ముందుగానే ట్విట్ట‌ర్‌లో వీడియో ద్వారా తెలిపాడు. అయితే ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 8న యశ్‌ నివాసానికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పే రవిని ఈ సారి సెక్యూరిటీ అడ్డుకోవ‌డంతో మ‌న‌స్థాపానికి గురైన అత‌ను ఈ దారుణానికి పాల్ప‌డ్డాడ‌ని అంటున్నారు.

3922
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles