తమిళసూపర్స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కాలా. పా రంజిత్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించగా, నిన్న సాయంత్రం మూవీ నుండి ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. యమ గ్రేట్ అంటూ సాగే ఈ పాటకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా, హరిహరసుధన్,సంతోష్ నారాయణ్ కలిసి పాడారు.తాజాగా విడుదలైన సాంగ్ రజనీ అభిమానులని అలరిస్తుంది. కాలా చిత్రం మురికివాడల నేపథ్యంలో రూపొందగా, ఈ చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. తమిళ నటుడు సముద్రఖని, నానా పటేకర్, బాలీవుడ్ బ్యూటీ హూమా ఖురేషి, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అరవింద్ ఆకాశ్ అనే నటుడు కాలా చిత్రంలో శివాజీ రావ్ గైక్వాడ్ అనే పేరుతో ఓ మరాఠి పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం.