విక్ర‌మ్ వేద రీమేక్ వార్త‌ల‌ని ఖండించిన నిర్మాణ సంస్థ‌

Sat,March 23, 2019 08:27 AM
y not studios condense the rumors of vikram vedha remake

2017 జులైలో విడుదలైన త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం విక్ర‌మ్ వేద తెలుగులో రీమేక్ కానున్న‌ట్టు కొన్నాళ్ళ నుండి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మిళ వ‌ర్షెన్‌లో న‌టించిన మాధవన్, విజయ్ సేతుపతి పాత్ర‌ల‌లో బాల‌కృష్ణ‌, రాజ‌శేఖ‌ర్ న‌టించ‌నున్న‌ట్టు రీసెంట్‌గా ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్తలపై విక్రమ్‌ వేదా నిర్మాణ సంస్థ వై నాట్ స్టూడియోస్‌ క్లారిటీ ఇచ్చింది. బాలయ్య, రాజశేఖర్‌ విక్రమ్‌ వేదా రీమేక్‌లో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ పుకార్లని కొట్టిపారేశారు. విక్ర‌మ్ వేద రీమేక్ హ‌క్కుల‌ని ఎవ్వ‌ర‌కి ఇవ్వ‌లేదు. మేం చెప్పే వ‌ర‌కు తప్పుడు వార్త‌ల‌ని ఎవ్వ‌రు న‌మ్మోద్దు. అలానే తప్పుడు సమాచారాన్ని పట్టించుకోకూడదని మీడియాను మేం కోరుతున్నాం. ధన్యవాదాలు’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. పుష్క‌ర్ గాయ‌త్రి తెర‌కెక్కించిన విక్ర‌మ్ వేద‌ చిత్రం ఓ పోలీస్ ఆఫీస‌ర్.. వీధిరౌడీ మ‌ధ్య జ‌రిగే పోరాటం నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇందులో మాధ‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌గా, విజ‌య్ సేతుప‌తి ప్రతినాయకుడిగా నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 2017 జులైలో విడుదలైన ఈ చిత్రం రూ.11 కోట్ల బడ్జెట్‌తో నిర్మితం కాగా, రూ.64 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఐఎండీబీ (ఇంటర్నెట్ మేనేజ్మెంట్ డాటాబేస్)లో 2017 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో నిలిచి ‘బాహుబలి 2’ చిత్రాన్ని వెనక్కినెట్టింది.

1150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles