యూకే షెడ్యూల్ పూర్తి చేసుకున్న బ‌యోపిక్ మూవీ

Sat,April 21, 2018 12:54 PM
wrap the schedule of The Accidental Prime Minister in UK

మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ జీవిత నేప‌థ్యంలో బ‌యోపిక్ రూపొందుతున్న‌సంగ‌తి తెలిసిందే. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌' ఆధారంగా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం తెరకెక్కుతుంది. చిత్రంలో అనుప‌మ్ ఖేర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, కీల‌క పాత్ర అయిన‌ సోనియా గాంధీ పాత్ర‌కి జ‌ర్మ‌న్ యాక్ట‌ర్ సుజానే బెర్నెర్ట్ ఎంపిక చేశారు. ఇక సంజ‌య్ బారు పాత్ర‌లో అక్ష‌య్ ఖ‌న్నా న‌టించ‌నున్నాడని తెలుస్తుంది.

మ‌న్మోహ‌న్ సింగ్ బ‌యోపిక్ వ‌చ్చే ఏడాది డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. విజ‌య్ ర‌త్నాక‌ర్ గుత్తే తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం కొద్ది రోజులుగా లండ‌న్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజాగా ఓ వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ యూకే షెడ్యూల్ పూర్తైందని అనుప‌మ్ ఖేర్ తెలిపారు . వీడియోలో ప్ర‌కృతి అందాల‌ని చూపిస్తూ ఈ స్థ‌లం చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నాకు అంత‌ర్గ‌తంగా కూడా ముఖ్య‌మైన‌ది అని కామెంట్ రాశాడు అనుప‌మ్‌. చిత్రానికి సలీమ్‌-సలైమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో ఈ బయోపిక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారని స‌మాచారం.

811
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles