ఆహా.. ఏమా గాత్రం...

Sat,August 24, 2019 06:34 PM
wow what asinging

ముంబై: ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుందని సమాజంలో సాధారణంగా వినిపించే విషయం. కొందరు ఆ టాలెంట్ తమకుందని తెలిసినా ఎలా రీచ్ కావాలో తెలియక మిన్నకుండిపోతారు. ఇంకొందరైతే మనకెందుకులే అనుకుంటారు. రెగులర్‌గా చేసే పని కాకుండా ఎవరికైనా ఏదైనా ఒక డిఫరెంట్ టాలెంట్ ఉంటుందని, దానిని ఉపయోగించుకుంటే జీవితంలో స్థిరపడొచ్చు అని తెలియదు. కానీ ఏమి తెలియని ఓ అభాగ్యురాలు సైతం తనలోనూ కళ ఉందని చాటి చెప్పిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని రణాఘాట్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

రైల్లో ప్రయాణిస్తున్న ఆమె లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ పాడిన ఏక్ ప్యార్ కా నగ్మా హై అనే పాట పాడుతూ అందరినీ తన వైపుకు తిప్పుకున్నది. ఆమె అందరు వినాలని పాడలేదు. మామూలుగా పాడుకుంటూ రైల్లో తిరుగుతున్నది. రైల్లోని ప్రయాణీకుంతా ఆమె పాటకు ముగ్ధులయ్యారు. కానీ ఆమెకావిషయం తెలియదు. ఆమె వస్త్రధారణ, చింపిరిజుట్టు , ఆకలితో అలమటిస్తున్న ఆమెను చూస్తే ఎవరూ నమ్మలేకపోయారు. అలాగే చూస్తుండిపోయారు. ఓ యువకుడు మాత్రం తన మొబైల్‌లో వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

ఈ వీడియో కాస్తా బాలీవుడ్ సంగీతదర్శకుడు, నటుడు, గాయకుడైన హిమేశ్ రిషేమియా చూశాడు. అతన్ని ఆమె పాట ఎంతో ఆకట్టుకుంది. ఆమె వివరాలు తెలుసుకున్న అతడు ఆమెను ముంబై రప్పించి ఆమె బాగోగులు తెలుసుకొని, తన సినిమాలో పాట పాడాలని కోరాడు. దానికామె సరేననడంతో తనతో పాటు డ్యూయట్ పాడించాడు. ఆ పాట ప్రోమో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

2287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles