‘అర్జున్ రెడ్డి’లా విజయ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్

Fri,September 20, 2019 05:16 PM

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మరోసారి అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేసేలా వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ ఉంది. చేతిలో సిగరెట్, ముఖంపై రక్తపు మరకలతో మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ.


ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో అధికభాగం పారిస్‌లో షూట్ చేశారు. మిగిలిన షూటింగ్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ గడ్డం పెంచుకుని హార్ట్ బ్రేక్ అయిన ఒక ఫెయిల్యూర్ లవర్‌లా క‌నిపిస్తాడ‌ని టాక్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు నిర్మాణంలో ఈ సినిమా చేస్తున్నారు.

2709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles