చైనా మట్టితో వరల్డ్ కప్ నమూనా

Sun,May 12, 2019 08:19 PM
world cup model made with china sand in peddapally


పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజనీకాంత్ చైనా మట్టితో ఐపీఎల్ టీ-20 వరల్డ్ కప్‌ను తయారుచేశాడు. 3.2 సెంటీ మీటర్ల ఎత్తు, 2 సెంటీ మీటర్ల వెడల్పుతో క్లే మౌల్డింగ్ ఆర్ట్ ద్వారా వరల్డ్ కప్ ను వేసినట్లు రజనీకాంత్ తెలిపాడు. కప్ ను దాదాపు 4 గంటల పాటు శ్రమించి తయారు చేసినట్లు పేర్కొన్నాడు. నేడు హైదరాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్ ముంబాయి ఇండియన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తయారు చేసినట్లు పేర్కొన్నారు. రజనీకాంత్ తయారు చేసిన సూక్ష్మ కప్ క్రికెట్ కీడాభిమానులను ఆకట్టుకుంటున్నది.

1406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles