షూ పాలిష్ చేసిన నాగ్‌.. షాకైన హౌజ్‌మేట్స్

Sun,September 15, 2019 07:10 AM

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 ఈ రోజుతో స‌క్సెస్‌ఫుల్‌గా ఎనిమిది వారాలు పూర్తి చేసుకోనుంది. ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి ఒక‌రు ఎలిమినేట్ కానుండ‌గా, ఆ వ్య‌క్తి ఎవ‌ర‌నే దానిపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఎనిమిదో వారంలో పున‌ర్న‌వి, మ‌హేష్‌లు కాస్త అత్యుత్సాహం చూపిస్తూ బిగ్ బాస్‌కే రివ‌ర్స్ కావ‌డం వారిద్ద‌రి కొంప ముంచేలా క‌నిపిస్తుంది. ఇద్ద‌రికి త‌గిన బుద్ది చెప్పేలా స్వ‌యంగా నాగ్ బిగ్ బాస్ స్టేజ్‌పై షూ పాలిష్ చేశాడు. ఏ ప‌నైన చిన్న‌ది కాదు. చేసే ప‌ని బ‌ట్టి మ‌నిషి స్థాయి త‌గ్గ‌డం, పెర‌గ‌డం ఉండ‌దు. చేసే తీరు బ‌ట్టి ఉంటుంది అంటూ హౌజ్‌మేట్స్‌కి హిత‌బోధ చేశాడు నాగ్.


56వ ఎపిసోడ్‌లో నాగ్ చాలా సీరియ‌స్‌గా ఎంట్రీ ఇస్తూ.. డైరెక్ట్‌గా ఇంటి స‌భ్యుల‌తో మాట్లాడేందుకు సిద్ధ‌మ‌య్యారు. శ్రీముఖి, పున‌ర్న‌వి, మ‌హేష్‌ల‌కి ఫుల్ క్లాస్ పీకారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ బుల్‌షిట్ టాస్క్ అంటావా ? ఇలా మాట్లాడ‌టం క‌రెక్టేనా ? నీకు ఇబ్బంది ఉన్న‌ప్పుడు బిగ్ బాస్‌కి చెప్పాలి అంతే కాని ఇలాంటి మాట‌లు మాట్లాడ‌టం స‌రైన‌దా అంటూ పున‌ర్న‌వికి వార్నింగ్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఇప్పుడు షూ పాలిష్‌ చేయమంటాడు.. రేపు చెడ్డీలు ఉతకమంటాడు. గతి లేక వచ్చామా అని మ‌హేష్ అన్న మాట‌ల‌ని ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌కి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు నాగ్. గేట్స్ ఓపెన్ చేసే ఉన్నాయి. వెళ్ళాల‌ని ఉంటే వెళ్లిపో అంటూ మ‌హేష్‌పై చాలా సీరియ‌స్ అయ్యాడు.

ఇక శ్రీముఖిపై కూడా ఫుల్ సీరియ‌స్ అయిన నాగ్.. నువ్వు ఏమైన హౌజ్‌కి బిగ్ బాస్ అనుకుంటున్నావా ? నువ్వు ఆడ‌కుండా ప‌క్క వాళ్ళ‌ని కూడా చెడ‌గొట్ట‌డం మంచి ప‌ద్ద‌తి అనుకుంటున్నావా అంటూ ఆమెకి చుర‌క‌లంటించారు. రూల్స్‌ సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆడావని, అందుకే పునర్నవికి కోపం వచ్చిందని.. రూల్స్‌ను ఫాలో అవుతూ గేమ్‌ ఆడాలని శిల్పాకు సూచించాడు. ఇంటి స‌భ్యుల‌లో ప్రోత్సాహం నింపేందుకు ప్రపంచ చాంపియన్‌ షిప్ బ్యాడ్మింటన్ ప్లేయ‌ర్ పీవీ సింధుని, ఆమె కోచ్ గోపించంద్‌ని బిగ్‌బాస్‌ స్టేజ్‌పైకి నాగార్జున తీసుకువచ్చాడు. సింధు కోసం రాహుల్ సాంగ్ పాడ‌గా, బాబా ఆడారు.

ఇక శ‌నివారం రోజు నాగార్జున ఇంటి స‌భ్యుల‌తో ఓ ఆటాడించారు. ఇంటి సభ్యుల్లో మహానటి/మహానటుడు/అంతకు మించి అనిపించే క్యారెక్టర్లను తెలిపాలనే టాస్క్‌ ఇచ్చాడు. టాస్క్‌లో ఎవ‌రి కంప్లైంట్స్ వారు నాగార్జున‌కి వివ‌రిస్తూ ఇంట్లో మహానటి/మహానటుడు/అంతకు మించి అనిపించేలా ఎవ‌రు ఉన్నారో చెప్పుకొచ్చారు. ముందుగా కెప్టెన్ అయిన వితికా- శిల్పా, హిమజ అని సెల‌క్ట్ చేయ‌గా ఆ త‌ర్వాత రాహుల్- శివజ్యోతి, పునర్నవి, రవి - శిల్పా, మహేష్‌, బాబా- హిమజ, శిల్పా, శివజ్యోతి - బాబా, రాహుల్‌, పునర్నవి - హిమజ, రాహుల్‌, హిమజ - శ్రీముఖి, వితికా, శ్రీముఖి- మహేష్‌, హిమజ, వరుణ్ - శిల్పా, మహేష్‌, మహేష్ - పునర్నవి, రాహుల్‌, శిల్పా - బాబా, పునర్నవిలను మహానటి/మహానటుడు, అంతకుమించి క్యాటగిరీలో పేర్కొన్నారు.

అయితే ఈ టాస్క్ వ‌ల‌న ఇంట్లో ఎంతో క్లోజ్‌గా ఉండే పున‌ర్న‌వి, రాహుల్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు చెల‌రేగాయి. టాస్క్‌లో గేమ్ ఆడ‌లేన‌ని పున‌ర్న‌వి రెచ్చ‌గొట్ట‌డం త‌న‌కి న‌చ్చ‌లేద‌ని రాహుల్ చెప్ప‌గా, నేను కామ‌న్‌గా చెప్పాను తప్ప అందులో వేరే అర్ధం లేదని పున‌ర్న‌వి వివ‌ర‌ణ ఇచ్చింది. చిన్న విష‌యాన్నైన చాంతాడు అంత లాగే పునర్న‌వి ఈ వివాదం వ‌ల‌న రాహుల్‌తో ఫ్రెండ్షిప్‌కి బ్రేక్ పెట్టేస్టింది. అనంతరం నామినేష‌న్‌లో ఉన్న హిమ‌జ‌, శ్రీముఖి, శిల్పా చ‌క్ర‌వ‌ర్తి, మ‌హేష్‌, పున‌ర్న‌విల‌లో హిమ‌జ సేవ్ అయిన‌ట్టు నాగార్జున పేర్కొన్నారు. మిగ‌తా వారిలో ఒక‌రు ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ వీడ‌నున్నారు .


3930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles