దర్శకుడి చితికి నిప్పు పెడతామంటున్న రాజ్ పుత్ మహిళలు

Fri,January 19, 2018 04:40 PM
womens fire on Sanjay Leela Bhansali

కెరీర్ లో ఎన్నో ఎపిక్స్ మూవీస్ తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ తాజాగా రాణి పద్మావతి జీవిత నేపథ్యంలో పద్మావత్ మూవీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. చరిత్రని వక్రీకరించారనే కారణంగా మూవీని విడుదల కాకుండా కర్ణిసేన కార్యకర్తలు అడ్డుపడుతూ వస్తున్నారు. సుప్రీం కోర్టు అనుమతితో జనవరి 25న మూవీ రిలీజ్ కి సిద్ధం కాగా, ఆందోళనకారుల నిరసనలతో ఈ మూవీ విడుదల కష్టమనే డౌట్ అభిమానులలో కలుగుతుంది. ఇప్పటికే పలు థియేటర్స్ ద్వంసం చేయడంతో పాటు చిత్రంలోని పాటలు ఎక్కడ ప్లే అయిన అక్కడ వీరంగం సృష్టిస్తున్నారు. గతంలో పద్మావత్ మూవీ విడుదల అయితే ఆత్మాహుతికి పాల్పడతామని క్షత్రియ వర్గానికి చెందిన మహిళలు ఆందోళన చేయగా, ఇప్పుడు రాజ్ పుత్ వర్గానికి చెందిన మహిళలు ఫైర్ అవుతున్నారు. సినిమా రిలీజ్ అయితే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ జౌహర్ ( ఆత్మాహుతి)కి పాల్పడాలని, అప్పుడు ఆయన చితికి మేమే నిప్పు పెడతామని రాజ్ పుత్ వర్గానికి చెందిన మహిళలు హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కర్ణిసేన ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి చిత్రాన్ని ఎలా అయిన విడుదల కాకుండా అడ్డుకోవాలని భావిస్తుందట. ఇన్ని పరిణామాల మధ్య పద్మావత్ చిత్రం కనుక విడుదల అయితే గొప్ప విశేషమే మరి.

1318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS