మ‌రి కొద్ది గంట‌ల‌లో 2.0 చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌

Sat,November 3, 2018 08:05 AM
with in few hours 2.0 trailer releasing

సినీ ప్ర‌పంచం ఎన్నాళ్ళ‌నుండో ఎంతో ఆస‌క్తిగా ఒకే ఒకే ఒక్క సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. అది మ‌రేదో కాదు శంక‌ర్ విజువ‌ల్ వండ‌ర్ 2.0. సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ కథానాయకుడిగా భారీ బడ్జెట్‌ చిత్రంతో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. అమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం 3డీ, 2డీ ఫార్మాట్స్ లో విడుద‌ల కానుంది. ఆ మ‌ధ్య చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, దీనికి భారీ స్పంద‌న ల‌భించింది. ఇక ట్రైల‌ర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఉత్సుక‌త‌తో ఎదురు చూస్తుండ‌గా, ఈ రోజు మ‌ధ్యాహ్నం 12 గం.ల‌కి చెన్నైలోని స‌త్యం సినిమాస్‌లో ఈవెంట్‌ని నిర్వ‌హించి అక్క‌డ చిత్ర ట్రైల‌ర్‌ని 4డీ సౌండ్‌ టెక్నాలజీతో విడుదల చేయనున్నట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇంత వ‌ర‌కు ఆ టెక్నాల‌జీతో ఏ ఇండియ‌న్ సినిమా విడుద‌ల కాలేదు. దాదాపు రూ.450కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందింది. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. గతేడాది చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ‘2.0’ వీఎఫ్‌ఎక్స్‌ పనుల ఆలస్యంగా కారణంగా దాదాపు ఏడాది పాటు వాయిదా పడుతూ వచ్చింది.

2650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles